ఈ ఏడాది పాఠశాలలు తెరుద్దామా? వద్దా

తల్లిదండ్రుల అభిప్రాయాలు కోరుతూ విద్యాశాఖ సర్వే
తెలంగాణ
కేంద్రప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. ఒక రోజులో అభిప్రాయాలు సేకరించి అందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈనెల 19న కోరగా.. జూలై ఆఖరు వరకు సమయం కావాలంటూ రాష్ట్రం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల 



విద్యాశాఖాధికారులకు ఆన్‌లైన్‌ ఫార్మాట్‌ అందించింది. పాఠశాలలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఎప్పుడు ప్రారంభించాలి..? లేదా ఈ విద్యా 


సంవత్సరంలో పాఠశాలలు తెరవకూడదా..? పాఠశాలలు ప్రారంభిస్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నారు..? పాఠశాల ప్రారంభిస్తే ఎలా నడపాలి..? అన్న మూడు ప్రశ్నలు సర్వేలో భాగంగా అడుగుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "ఈ ఏడాది పాఠశాలలు తెరుద్దామా? వద్దా"

  1. COvid వాక్సిన్ వచ్చేవరకు పాఠశాలలు తెరవకుండా ఇంటిలోనే పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవడం చాలా ముఖ్యం

    ReplyDelete