ఏపీలో మరో 1775 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో
కొత్తగా 1,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర
రాష్ట్రాలకు నుంచి వచ్చిన 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో
నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14393
మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు
గడిచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం
ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. అనంతపురం,కడప,విశాఖపట్నంలో
ఒక్కరు చొప్పున మొత్తం 17 మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 309 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు
కరోనా కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 12,533
యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 11,36,255 కరోనా నిరార్ధణ
పరీక్షలు నిర్వహించారు
0 Response to "ఏపీలో మరో 1775 కరోనా కేసులు"
Post a Comment