ఏపీలో 1,322 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేసులతో
పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఓ వైపు కరోనా కేసులు... మరోవైపు మరణాలతో
ఏపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏరోజుకారోజు కరోనా రికార్డులు బద్దలు
కొడుతోంది. సోమవారం ఏపీలో కొత్తగా 1,322 కరోనా పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఏపీలో 1,263, ఇతర రాష్ట్రాల
నుంచి వచ్చిన 56మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది.
ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 20,019కి కరోనా పాజిటివ్ కేసులు
చేరాయి. ఏపీలో 10,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా జయించి
8,920మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనాతో మొత్తం 239మంది మృతి చెందారు
లాక్‌డౌన్‌ను అమలు చేసినప్పుడు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రత అదుపులో
ఉంది. నిబంధనలను సడలించడం, ప్రజలు బయట తిరుగుతుండటం, అధికారులు ఉదాశీనంగా
వ్యవహరిస్తుండటంతో కరోనా కాలనాగు మరింత పడగ విప్పింది. ఈ నేపథ్యంలో ఇకనైనా
కట్టుదిట్టమైన జాగ్రత్తలు, నిరోధక చర్యలు తీసుకోవాల్సి ఉందని వైద్యవర్గాలు
సూచిస్తున్నాయి. ప్రభుత్వం వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
తీసుకోవాలని, సమూహ వ్యాప్తికి రాకముందే కఠినమైన కార్యాచరణను చేపట్టాలన్నారు
0 Response to "ఏపీలో 1,322 కరోనా పాజిటివ్ కేసులు"
Post a Comment