జూలైలో టీచర్ల బదిలీలు
ఈసారి పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండవు
మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసు ప్రాతిపదిక
తొలుత రేషనలైజేషన్.. త్వరలో ఉత్తర్వులు
జూలైలో టీచర్ల బదిలీలు
మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసే ప్రాతిపదిక.. త్వరలో ఉత్తర్వులు
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు పూర్వరంగం సిద్ధమవుతోంది. ఇటీవల సీఎం ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ మేరకు జూలైలో బదిలీలు చేపట్టే దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూలై నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేసేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ బదిలీలకు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతారు. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వెబ్ ఆధారితంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. గతంలో అమలు చేసిన పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానాన్ని ఈసారి రద్దు చేశారు. వివిధ కేటగిరీల టీచర్లకు ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు మాత్రం కొనసాగుతాయి.
ఉపాధ్యాయుల మొత్తం సర్వీసు, స్టేషన్ సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకేచోట ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను, అలాగే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. లాంగ్ స్టాండింగ్ కటాఫ్ డేట్‌ను ఈ నెల 30 వరకూ తీసుకుంటారని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ల బదిలీల కంటే ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నందున తొలుత ఆ దిశగా కసరత్తు చేయనున్నారు.
సీఎం సొంత జిల్లాలో అడ్డదారిలో టీచర్ల బదిలీలు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల అడ్డదారి బదిలీలకు తెరలేచిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో తాజాగా విడుదలవుతున్న ఆర్డర్లే ఇందుకు నిదర్శనం. ఆ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులను ప్రభుత్వం అడ్డదారిలో బదిలీ చేసింది. వీరిలో కొందరు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో రిలీవ్ అయ్యి, కొత్త ప్రదేశంలోని పాఠశాలలో చేరి పోయారు. మరికొందరు నేడో, రేపో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జూలైలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడానికి విద్యాశాఖ ఒకవైపు కసరత్తు చేస్తోంది. ఈలోపే ప్రభుత్వం టీచర్లను బదిలీ చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
0 Response to "జూలైలో టీచర్ల బదిలీలు"
Post a Comment