ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల.. కొత్తగా
అమరావతి: ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 50, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 84 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో కొత్తగా ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. ఈ రెండు కరోనా మరణాలు కృష్ణా జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. శుక్రవారం కరోనా నుంచి కోలుకున్న 21 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది.
ఏపీలో కరోనా మరణాల సంఖ్య 73కు చేరింది. కొత్తగా.. నమోదైన కరోనా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250కి చేరింది. ఏపీలో ఇప్పటివరకూ 2294 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 9,831 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది
0 Response to "ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల.. కొత్తగా"
Post a Comment