ఇకపై ఏటీఎం ముట్టుకోకుండా డబ్బులు తీసుకోవచ్చు
ముంబై: ఏటిఎం నుండి డబ్బులు ఉపసంహరించుకునేందుకు త్వరలో కొత్త
విధానం రాబోతోంది. ఫలితంగా ఎటిఎం నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి
యంత్రంలోని ఏ భాగాన్నీ తాకనవసరం లేదు.
లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో
కరోనా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్
వినియోగదారులు ఏటీఎంకు వెళ్లి డబ్బులు ఉపసంహరించుకోవాలంటేనే
భయపడుతున్నారు. దీనిని గ్రహంచిన వివిధ బ్యాంకులు కాంటాక్ట్‌లెస్ ఏటీఎం
మెషీన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి.
మీడియాకు అందిన సమాచారం
ప్రకారం ఏటీఎం టెక్నాలజీపై పనిచేసే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్
కొత్తగా ఒక మెషీన్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో మొబైల్ ఫోన్ ఆధారంగా
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా
చేసుకోవచ్చు.
ఈ నూతన విధానం వలన కార్డ్ క్లోనింగ్ అవుతుందన్న భయం
కూడా ఉండదు. దీనితోపాటు కాంటాక్ట్‌లెస్ ఏటీఎంల సాయంతో డబ్బులను కేవలం 25
సెకన్లలోనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ఏటిఎం
స్క్రీన్‌లో చూపించిన క్యూఆర్‌ను స్కాన్ చేయాల్సివుంటుంది.
క్యూఆర్ కోడ్
ఫీచర్ ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుందని,
ఇది చాలా సురక్షితమని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది
0 Response to " ఇకపై ఏటీఎం ముట్టుకోకుండా డబ్బులు తీసుకోవచ్చు"
Post a Comment