ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదల
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. తాజా వివరాలను బట్టి గత
24 గంటల్లో 12,771 శాంపిల్స్‌ను పరీక్షించగా 161 మంది కరోనా పాజిటివ్‌గా
తేలారు. 29 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో
నమోదైన మొత్తం 3588 పాజిటివ్ కేసులలో 2323 డిశ్చార్జ్ కాగా, 73 మంది
మరణించారు. ప్రస్తుతం 1192 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 41 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 741 మంది పాజిటివ్ కేసులు నమోదుకాగా... వీరిలో 467 మంది చికిత్స పొందుతున్నారు
0 Response to "ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్ విడుదల"
Post a Comment