షెడ్యూల్ ప్రకారమే ‘టెన్త్
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ ప్రకారమే జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సన్నద్ధం కావాలని, పిల్లల్లోనూ మానసి క స్థైర్యం, ధైర్యం నింపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా వల్ల కాస్త ఇబ్బంది అయినా వెనుకంజ వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. సోమవారం విజయవాడలోని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, సన్నాహాల నిమిత్తం జిల్లా అధికారులతో పాటు పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించి, వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, థర్మల్ స్కానింగ్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. కరోనా నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరిస్తూ పరీక్షలకు సిద్ధమయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం ఇస్తూ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రతి కేంద్రానికీ విద్యార్థులతో పాటు ఎక్కువ మంది రాకుండా కట్టడి చే సేందుకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. జూలై 11 నుంచి 18 వరకూ జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జా గ్రత్తలు తీసుకుంటామన్నారు. పరీక్షల్లో పాస్ కాలేదని విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడవద్దని, ఒకసారి ఫెయిలైతే మరో అవకాశం ఉందని, ఇవి మన సామర్థ్యానికి పరీక్షలని విద్యాశాఖ మంత్రి సూచించారు
0 Response to "షెడ్యూల్ ప్రకారమే ‘టెన్త్"
Post a Comment