కరోనాను లెక్క చేయకుండా పని చేస్తే ఇదేనా బహుమానం?: చంద్రశేఖర్‌రెడ్డి
విజయవాడ: ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయూస్ ఫెడరేషన్
ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో సంఘాల నిరసన కార్యకర్రమం జిరగింది. కేంద్రం
నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లంచ్ సమయంలో గంట పాటు ఆందోళన నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, విద్యాసాగర్, ఇతర ఉద్యోగులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర
ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు
కోవిడ్ 19 విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలకంగా పని చేస్తున్నారని
పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పని చేసినా.. మూడు డీఏలను ఫ్రీజ్
చేయడాన్ని ఖండిస్తున్నామని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనాను లెక్క
చేయకుండా పని చేస్తే ఇదేనా బహుమానమని ప్రశ్నించారు.
ఏపీలో రెండు నెలలు సగం
జీతాలే ఇచ్చినా తాము.. పని చేశామన్నారు. వరాలను ప్రకటించాల్సిన కేంద్రం..
ఉన్న రాయతీలను రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని
రద్దు చేసుకునే వరకు పోరాడతామన్నారు.
రెండు సంవత్సరాల నుంచి పీఆర్సీ కూడా
ఇవ్వలేదని.. వెంటనే ఇవ్వాలని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు
0 Response to "కరోనాను లెక్క చేయకుండా పని చేస్తే ఇదేనా బహుమానం?: చంద్రశేఖర్‌రెడ్డి"
Post a Comment