ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో
కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప..
తగ్గడం లేదు.
గత 24 గంటల్లో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన 98 మందికి కరోనా పాజిటివ్ రాగా..
వివిధ రాష్ట్రాలు,
విదేశాల నుంచి 43 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని
ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో
మొత్తం 4, 112కి కరోనా కేసులు చేరాయి.
కోవిడ్ కారణంగా గుంటూరులో ఒకరు,
కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో కరోనా మృతుల
సంఖ్య 71కి చేరింది. ఇక వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 2309
మంది డిశ్చార్జ్ అయ్యారు.
మరో 1520 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స
పొందుతున్నారు. ఇక కోయంబేడు లింకులతో కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయి
0 Response to "ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు"
Post a Comment