ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ 5.0ను కేంద్ర ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకరిద్దరికి పాజిటివ్ అని రావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొత్త మార్గదర్శకాలు ఇవీ..
- దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విధులకు రాకూడదు
- సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలి
- కట్టడి ప్రాంతాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- ఇంటర్‌కామ్ ఫోన్లలోనే ఉద్యోగులు మాట్లాడుకోవాలి
- కంప్యూటర్ కీబోర్డులు ఎవరికి వారే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
- సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించుకోవాలి
- ఉద్యోగులు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవద్దు అని కొత్త మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. దేశంలో గత 24 గంటల్లో 9,987 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 331 మంది కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 66 వేల 598కు చేరుకుంది. దేశవ్యాప్తంగా లక్షా 29 వేల 917 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 7,466 మంది కరోనాతో మరణించారు. కాగా దేశంలో రికవరీ రేటు 49 శాతానికి చేరింది
0 Response to "ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు"
Post a Comment