విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.3,700 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ, జూన్ 28:
దేశంలోని ఆరు రాష్ర్టాల్లో పాఠశాల విద్య, పాలనతో నాణ్యతను మరింత
మెరుగుపరిచేందుకు దోహదపడే 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,700 కోట్ల)
రుణానికి ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం
తెలిపింది.
ఈమేరకు జూన్ 24న స్ర్టెంథెనింగ్ టీచింగ్-లెర్నింగ్ అండ్
రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ ప్రోగ్రామ్ (స్టార్స్)కు రుణం అందించేందుకు
బోర్డు అనుమతిచ్చినట్టు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా
15 లక్షల పాఠశాలల్లోని 25 కోట్ల మంది విద్యార్థులు (6-17 మధ్య వయస్కులు),
కోటికి పైగా టీచర్లకు లబ్ధి చేకూరనుంది
0 Response to "విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.3,700 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం"
Post a Comment