రేపటి నుంచి అన్‌లాక్ 2.O ప్రారంభం

న్యూఢిల్లీ: అన్‌లాక్ 1.O మంగళవారంతో పూర్తి అవుతుంది. జులై 1 నుంచి అన్‌లాక్ 2.O ప్రారంభం కానుంది. కానీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షల 67వేలు దాటింది. ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. 40 రోజుల కరోనాపై ప్రధాని నుంచి ప్రకటన వస్తుందా? అని దేశ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.



అయితే తాజాగా విడుదల చేసిన అన్‌లాక్ 2.O నిబంధనలు చూస్తే కేంద్రం వైఖరి స్పష్టమవుతోంది. కరోనా కట్టడి రాష్ట్రాలకే వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రీత్యా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే తీవ్రతనుబట్టి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సంకేతాలిచ్చింది. వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు కట్టడి ప్రాంతాలకే ఆంక్షలు పరిమితం చేయగా.. ఇంకొన్ని రాష్ట్రాలు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మళ్లీ లాక్ డౌన్ విధించనున్నట్టు సంకేతాలిచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రేపటి నుంచి అన్‌లాక్ 2.O ప్రారంభం"

Post a Comment