ఏపీలో కొత్తగా 246 పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 246 కరోనా పాజిటివ్
కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,173 పరీక్షలు చేయగా.. వారిలో
246 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.
దీంతో రాష్ట్రంలోని మొత్తం
పాజిటివ్ కేసుల సంఖ్య 5087కి చేరింది. తాజాగా రెండు మరణాలు సంభవించడంతో
మొత్తం మృత్యుల సంఖ్య 86కి పెరిగింది.
ఇప్పటి వరకు వైరస్ నుంచి 2770 మంది
బాధితులు కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2231 యాక్టివ్
కేసులు ఉన్నాయి. NM
ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్
విడుదల చేసింది. మరోవైపు వైరస్ నివారణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు
నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది
0 Response to "ఏపీలో కొత్తగా 246 పాజిటివ్ కేసులు"
Post a Comment