పురపాలక ఉద్యోగు లకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం?



పురపాలక ఉద్యోగు లకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం?


 పురపాలక ఉద్యోగు లకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం చెల్లించే అవకాశాలున్నాయి. కరోనా నేపథ్యంలో వీరికి రెండు నెలలుగా (మార్చి, ఏప్రిల్‌) 50 శాతం తగ్గించి వేతనం ఇస్తున్నారు.



ప్రజారోగ్య విభా గంలో పని చేస్తున్న కార్మికులకు మళ్లీ పూర్తి స్థాయిలో వేతనాలను చెల్లించారు. కరోనా నియంత్రణలో భాగంగా పురపాలక అధికారుల నుంచి కార్యాలయ ఉద్యోగుల వరకు సేవలంది స్తున్నందున అత్యవసర సేవలుగా పరిగణించి పూర్తి వేతనం చెల్లించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


గ్యాస్‌ లీకేజీ దుర్దటన నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పురపాలక ఉద్యోగు లకు వచ్చే నెల నుంచి పూర్తి వేతనం?"

Post a Comment