నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింతగా సడలిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్‌డౌన్‌ గడువు మే 17తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. ‘‘అంతరాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభిస్తున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి అసోంకు వారానికి ఒకే రైలు వచ్చే విధంగా చూడాలి. వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో జాగ్రత్తపడటం అవసరం’’ అని మోదీతో పేర్కొన్నారు.(అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్‌)
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమన్నారంటే... 
ప్యాకేజీ ప్రకటించాలి: పినరయి విజయన్‌
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. రోడ్డు, రైళ్లు, విమానాల సర్వీసులను కచ్చితంగా పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అయితే సామాజిక ఎడబాటు, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో మెట్రో రైళ్లు, బస్సులు నడిపేందుకు అనుమతినివ్వాలని కోరారు. సూక్ష్మ, చిన్న, తరహా తరగతి పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. (అది మానవుడి సహజ లక్షణం: మోదీ)

అక్కడ రెండో దశ.. జాగ్రత్తగా ఉండాలి
జూన్‌ లేదా జూలై నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు శిఖరస్థాయికి చేరుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అభిప్రాయపడ్డారు. వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని అన్నారు. అయితే ముంబైలో నిత్యావసరాల కోసం స్థానిక రైళ్లను నడిపేందుకు అనుమతినివ్వాలని కోరారు. ‘‘వుహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత రెండో దశ ప్రారంభమైనట్లు నేను చదివాను. ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి’’అని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.(రైళ్లను ఇప్పుడే పునరుద్దించవద్దు: ప్రధానితో సీఎం కేసీఆర్‌)
సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం
ఆర్థిక కార్యకలాపాల విషయంలో రాష్ట్రాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కరోనా తీవ్రతను బట్టి గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్లను విభజించే అధికారం కూడా రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందన్నారు.
ఇక పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను పునురుద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 

మే 31 వరకు రైళ్లు, విమానాలు వద్దు
‘‘మే 12 నుంచి ఢిల్లీ నుంచి చెన్నైకి రెగ్యులర్‌గా రైళ్లు నడుపబోతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నాం. చెన్నైలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మే 31 వరకు రాష్ట్రంలోకి విమాన, రైలు సర్వీసులను నిలిపివేయండి’’అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ప్రధాని మోదీని కోరారు
లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానికి సూచించిన సీఎంలు

న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను పొడిగించాలని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా లాక్‌డౌన్ పొడిగింపును కోరుకుంటున్నారు. 
తెలంగాణలో ఇప్పటికే ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.

పంజాబ్, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించాయి.
వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మూడోదశ ఈ నెల 17న ముగియనుంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంది. నేడో, రేపో కేంద్రం లాక్‌డౌన్‌-4 ప్రకటించవచ్చు.

గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి

చేయాలి
ప్రస్తుతం మన ముందున్న ఛాలెంజ్ ఇదే
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలతో పీఎం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన ముందు ఓ ఛాలెంజ్ ఉందని సీఎంలతో మోదీ వ్యాఖ్యానించారు.
భారత్‌లోని గ్రామాలకు కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని ప్రధాని మోదీ సీఎంలతో అన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారు.

ప్రధాని కీలక నిర్ణయం.. రాత్రి 9.30 వరకూ


న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ కొనసాగుతోంది. అయితే.. పలు అంశాలపై విస్తృతంగా చర్చించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలైన సమావేశం రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగనున్నట్లు సమాచారం. మధ్యలో సాయంత్రం 6 గంటలకు అరగంట విరామ సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇప్పటివరకూ లాక్‌డౌన్ నేపథ్యంలో నాలుగు సార్లు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే.. ఇంత సుదీర్ఘ సమయం పాటు వీసీ కొనసాగించాలని ప్రధాని భావించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ నుంచి ఇవ్వాల్సిన మరిన్ని సడలింపులు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ సీఎంలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు

లాక్‌డౌన్‌కొనసాగింపా

.. సడలింపా?
కరోనా కట్టడిపై ఎలా ముందుకెళ్దాం?
సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ఈ విశ్వ మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ -3 మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 4200 కేసులు నమోదవ్వడంతో దీన్ని కట్టడి చేసే వ్యూహంపై చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఐదోసారి జరుగుతున్న ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌  రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు తొలి సెషన్‌; సాయంత్రం 6గంటల నుంచి రెండో సెషన్‌ జరగనుంది

గతంలో నాలుగు సార్లు జరిగిన సమావేశంలో కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కిన నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో అందరు సీఎంలకూ మాట్లాడే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అయితే, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? సడలిస్తారా? అని దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల అంశాలను పలు రాష్ట్రాలు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా,  ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు, ఎంఎస్‌ఎంఈ సహా పారిశ్రామిక రాయితీల అంశాలను ప్రధాని వద్ద లేవనెత్తే అవకాశం ఉంది.  దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేసుల తీవ్రతను బట్టి జోన్ల వారీగా కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది


లాక్‌డౌన్‌ అనంతర ఆర్థిక కార్యకలాపాలపైనే ప్రధాన చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించనున్నారు.
దేశంలో దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం అంశమే ప్రధానంగా చర్చ సాగనుంది. కోవిడ్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్‌ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపైనే వీరు దృష్టి సారించనున్నారు.


ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ ఆంక్షలపై మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 27వ తేదీన ప్రధాని మోదీ, సీఎంలతో చర్చ జరిగిన సమయంలో దేశంలో కోవిడ్‌ కేసులు 28వేల వరకు ఉండగా ప్రస్తుతం అది 63 వేల వరకు చేరుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపే ఐదో సమావేశం ఇది.
మార్చి 25వ తేదీన మొదటిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన కేంద్రం..మూడోసారి ఈ నెల 17వ తేదీ వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తూ..ప్రజల రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి పలు సడలింపులు చేపట్టింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌"

Post a Comment