మోడల్‌, కేజీబీవీ, గురుకుల.. పాఠశాలల్లో ఏకరూప పాలన

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), ఏపీ గురుకుల(రెసిడెన్షియల్‌) సొసైటీ పాఠశాలలను ఏకరూప పాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.


 పరిపాలన, విద్యా విషయక, ప్రణాళిక కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల్లో సారూప్యత, ఉమ్మడి విధుల పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా మెమో జారీ చేశారు. 



రాష్ట్రంలో 164 మోడల్‌ స్కూళ్లు, 352 కేజీబీవీ, 58 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ మూడు రకాల స్కూళ్లను ఏకరూప పాలన కిందకు తీసుకువస్తున్నారు. 


అయితే, సర్కారు నిర్ణయంపై ఆయా పాఠశాలల టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మోడల్‌, కేజీబీవీ, గురుకుల.. పాఠశాలల్లో ఏకరూప పాలన"

Post a Comment