పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ మారే అవకాశం

*✨ అకడమిక్ క్యాలెండర్*

★ లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ మారే అవకాశం.



★ ప్రతీ ఏటా జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయి. కరోనా వైరస్ వల్ల విధించిన ల డౌన్ లో ఈ ఏడాది క్యాలెండర్ అర్థాంతరంగా ముగిసింది.

★ దీంతో ఎప్పుడు పాఠశాలలు మొదలవుతాయా అని విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు ఎదురుచూస్తున్నారు.

★ జూన్లో లా డౌన్ ఎత్తివేస్తే సాధారణంగానే పాఠశాలలు ప్రారంభించాలని, లేదంటే అకడమిక్ క్యాలెండర్ ను ఈ ఏడాదికి మార్చా లని ప్రభుత్వం భావిస్తోంది. 

★ ఇటీవల విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 

★ లా డౌన్ కొనసాగితే ఈ విద్యా సంవత్సరం ఆగస్టు నుంచి 2021 ఏప్రిల్ వరకు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా సూచించాయి. 

★ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆగస్టు నుంచి నూతన విద్యా సంవత్సరం ఉంటుంది ప్రకటించింది. 

★ పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్ మార్పు కూడా తథ్యమని, అయితే ఎప్పటి నుంచి ఉంటుందో ప్రభుత్వం నిర్ణయించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

              

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ మారే అవకాశం"

Post a Comment