చదివిన స్కూల్లోనే టెన్త్‌ పరీక్ష



ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన




కరోనా మహమ్మారి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 



ఈ ఏడాది జూలై 10 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల మధ్య కనీసం 4 అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష గదులను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది.


 రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 2882 సెంటర్లు, ప్రైవేట్‌ విద్యార్థులకు 40 సెంటర్లు ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ, మారిన పరిస్థితుల్లో ఏ స్కూలు విద్యార్థులకు ఆ స్కూల్లోనే టెన్త్‌ పరీక్షలు రాసేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

దీనివల్ల రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. హాస్టళ్ల విద్యార్థులు కొవిడ్‌-19 నేపథ్యంలో హాస్టళ్ల మూతతో ఇళ్లకు చేరారు. అలాంటివారు ఎక్కడ పరీక్ష రాస్తారో అన్న విషయమై ఆప్షన్‌ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 14 కాలమ్‌లతో కూడిన ప్రొఫార్మాను తయారుచేసి పంపించింది.


 ఏపీఆర్‌ఈఐఎస్‌, ఏపీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, ఏపీబీసీఆర్‌ఈఐఎస్‌, కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఆశ్రమ్‌ స్కూల్‌, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ స్కూళ్ల విద్యార్థుల నుంచి ఈ నెల 25లోగా సమాచారం సేకరించాలని కోరింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "చదివిన స్కూల్లోనే టెన్త్‌ పరీక్ష"