గుడ్ న్యూస్ : పది పరీక్షలు రద్దు ...ఇక పై తరగతులకే



కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే ఈ వైరస్ వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే విద్యాసంస్థలన్ని మూతపడగా...కీలక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి.



 అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. అయితే.. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారోనని విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా పది పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు.

బోర్డు ఎగ్జామ్స్‌ కంటే ముందు ఆయా పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 

పైతరగతులకు విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన ఫైనల్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాయిదా పడ్డ సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం విదితమే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గుడ్ న్యూస్ : పది పరీక్షలు రద్దు ...ఇక పై తరగతులకే"

Post a Comment