ఎస్‌బీఐ రుణ రేట్లలో మార్పు
ఎంసీఎల్‌ఆర్‌లో 15 బేసిస్ పాయింట్ల కోత
దిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహరుణ వడ్డీరేట్లలో మార్పులు చేసింది. నిధుల వ్యయం ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) 7.4 శాతం నుంచి 7.25 శాతానికి బ్యాంక్ కుదించింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి రానుంది.
దీంతోతో ఎంసీఎల్‌ఆర్ ఆధారిత గృహ రుణ ఖాతాల ఈఎంఐ భారం నెలకు సుమారు రూ.255 మేర తగ్గొచ్చు (రూ.25 లక్షల రుణం-30 ఏళ్ల కాలం). అదే సమయంలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు (ఈబీఆర్) 7.05 శాతానికి 35 బేసిస్ పాయింట్లు మార్జిన్‌గా తీసుకుంది. (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) ఇందువల్ల రెపో ఆధారిత గృహ రుణరేటు 7.40 శాతం అవుతుంది. ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉంచింది.
* ‘ఎస్‌బీఐ
వుయ్‌కేర్ డిపాజిట్’ పేరుతో సీనియర్ సిటిజన్లకు ప్రారంభించిన ప్రత్యేక
డిపాజిట్ పథకంలో వారికి 0.3% అదనంగా వడ్డీ లభించనుంది. 5 ఏళ్లు లేదా
అంతకంటే ఎక్కువ కాలానికి డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పథకం
సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉండనుంది.
* 5
ఏళ్లలోపు కాలావధి కలిగిన సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.5%
అదనపు వడ్డీ ప్రయోజనం కూడా కొనసాగుతుందని, అందువల్ల కొత్త పథకంలో డిపాజిట్
చేసే వారికి సాధారణ డిపాజిట్‌దార్లతో పోలిస్తే, 0.8% అదనపు ప్రయోజనం
ఉంటుందని బ్యాంకు వివరించింది. ఒకవేళ 5 ఏళ్ల కంటే ముందే డిపాజిట్ ఉపసంహరణ
చేసుకుంటే, అదనపు ప్రీమియం వడ్డీ 0.3% ప్రయోజనం ఉండదని తెలిపింది.
* మూడేళ్లలోపు
కాలావధి గల అన్ని రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల
మేర ఎస్‌బీఐ తగ్గించింది. ఈ నెల 12 నుంచి ఇది అమల్లోకి రానుంది
0 Response to "ఎస్‌బీఐ రుణ రేట్లలో మార్పు"
Post a Comment