జియో ఫైబర్ సెట్‌టాప్ బాక్స్ యూజర్లకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: జియోఫైబర్ సెట్‌టాప్ బాక్స్ యూజర్లకు ఇది శుభవార్తే. ఇప్పుడు వీరి ఓటీటీ యాప్స్ జాబితాలోకి అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా వచ్చి చేరింది. 




గతేడాది జియో ఫైబర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. జియో ఫైబర్ యూజర్లు ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలు చూడాంటే కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వీరికి ఇది ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. 


అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’, ‘పంచాయత్’, ‘మీర్జాపూర్’ వంటి ఒరిజినల్ కంటెంట్‌తోపాటు ‘జోకర్’, ‘థప్పడ్’తోపాటు మరెన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. 



కాగా, జియో ఫైబర్‌ ఓటీటీ యాప్స్ జాబితాలో ప్రస్తుతం సన్‌నెక్స్ట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, వూట్, జియో సినిమా, ఎల్‌టీ బాలాజీతో పాటు మరెన్నో ఉన్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జియో ఫైబర్ సెట్‌టాప్ బాక్స్ యూజర్లకు గుడ్ న్యూస్"

Post a Comment