భారత్‌లో కరోనా మరణాల శాతం అతి స్వల్పం: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు కీలకమైన విషయాలు తెలిపింది. ప్రపంచంలో అతి తక్కువ మరణాలు భారత్‌లోనేనని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. భారత్‌లో కరోనా మరణాల శాతం 3.2% మాత్రమేనని చెప్పారు.
గత రెండు వారాలుగా కరోనా కేసులు రెట్టింపవడానికి 10.5
రోజులు పడుతుండగా, నేటికి 12 రోజులకు రెట్టింపవుతున్నాయని మంత్రి
చెప్పారు. అటు ఇవాళ ఒక్కరోజే పదివేల మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్
అయ్యారని మంత్రి వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకూ 39980 కేసులు నమోదయ్యాయి. 10633 మంది కోలుకున్నారు. 1301
మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో కరోనా
తీవ్రత అధికంగా ఉంది
0 Response to "భారత్‌లో కరోనా మరణాల శాతం అతి స్వల్పం: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ"
Post a Comment