త్వరలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించాలని భావిస్తున్నామని, ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావరవి, పి మాణిక్ రెడ్డి లు ఎమ్మెల్సీ నర్సిరెడ్డితోపాటు విద్యామంత్రిని కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఐదేళ్ళుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఎనిమిదేళ్ళుగా అంతర్ జిల్లాల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
మోడల్ స్కూళ్ళు ప్రారంభమై ఏడేళ్లయిందని, సర్వీసు నిబంధనలు కూడా విడుదలైనందున ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మంత్రిని కోరారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై చర్చిస్తున్నామని, ముఖ్యమంత్రితో మాట్లాడి బదిలీలు చేపడతామని అన్నారు
idi nijam kavadaniki......enthakalam...paduthundo
ReplyDelete