అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మరోసారి వీడియో కాన్ఫెరెన్స్
న్యూఢిల్లీ : అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం జరగనున్నట్లు సమాచారం. లాక్‌డౌన్ నిబంధనలను వచ్చే దశలో ఏవిధంగా సడలించాలన్న దానిపై మోదీ సీఎంలతో చర్చించనున్నారు. కంటేయిన్‌మెంట్ జోన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటు దేశంలో, అటు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యాలపాలు పుంజుకోవడంపైనే ప్రధానంగా చర్చించనున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో, దానిని తిరిగి ఎలా పట్టాలెక్కించాలన్న దానిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను మోదీ క్రోడీకరించనున్నారు. ఇప్పటికే మోదీ పలుమార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకున్న విషయం తెలిసిందే.
మూడోదశ లాక్‌డౌన్ తేదీ (మే 17) దగ్గరపడుతుండటంతో ఈ సమావేశానికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ అంశంపైనే ఒక్క శనివారమే రెండు దఫాలుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 17 తర్వాత ఏఏ రంగాల్లో సడలింపులు ఇవ్వాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం
0 Response to "అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మరోసారి వీడియో కాన్ఫెరెన్స్"
Post a Comment