ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లే అనిపిస్తోంది. గతవారంతో పోలిస్తే ఈ వారం రోజులుగా తక్కువ కేసులే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,666 సాంపిల్స్‌ని పరీక్షించగా 50 మందికి మాత్రమే కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారింపబడినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కు చేరుకుంది. ఇప్పటి వరకూ 925 మంది డిశ్చార్జ్ కాగా.. 45 మంది మరణించారు. ప్రస్తుతం 1010 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.


కొత్త కేసుల లెక్కలివీ..

కొత్తగా చిత్తూరు-16, కర్నూలు-13, గుంటూరు-6, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఐదేసి కేసులు, ప్రకాశం-2, విశాఖ, కృష్ణా, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి కర్నూలు- 566కు చేరుకోగా.. గుంటూరు-382, కృష్ణా- 339, అనంతపురం- 107, కడప- 97, నెల్లూరు- 101, చిత్తూరు-112, పశ్చిమ గోదావరి- 68, ప్రకాశం-63, విశాఖపట్నం- 63, తూర్పుగోదావరి- 46 శ్రీకాకుళం-05, విజయనగరం-04 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.



డిశ్చార్జ్ లెక్కలు ఇవీ..

గత 24 గంటల్లో 38 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కర్నూలు- 21, గుంటూరు-08, కృష్ణ-03, తూర్పు గోదావరి-02, విశాఖపట్నం-02, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్ చేయబడ్డారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 925కు చేరింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు నమోదు"

Post a Comment