AP కరోనా కేసులు... తాజా బులెటిన్
అమరావతి: ఏపీలోని కరోనా కేసులకు సంబంధించి తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్ పరీక్షించగా 54 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన 1887 పాజిటివ్ కేసులకుగాను 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1004. గత 24
గంటల్లో 62 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని బులెటిన్‌లో
పేర్కొన్నారు.
జిల్లాలవారీగా లెక్కలు... గత 24 గంటల్లో..
అనంతపురంలో 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9, కృష్ణాలో 6, కర్నూల్‌లో 7, చిత్తూర్‌లో 3, గుంటూరు, విజయనగర జిల్లాల్లో ఒక కేసు నమోదు కాగా, తూర్పుగోదావరి, కడప, నెల్లూర్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సంఖ్య ‘జీరో’గా ఉంది
0 Response to "AP కరోనా కేసులు... తాజా బులెటిన్"
Post a Comment