కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ 4.0: ప్రధాని మోదీ
న్యూదిల్లీ: కరోనాను కట్టడి చేసే క్రతువులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడోసారి లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకూ పొడింగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. లాక్‌డౌన్‌పై ఆయన ఏం చెబుతారని ఉత్కంఠతో ఎదురు చూశారు. 17వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ భావించినట్లుగానే లాక్‌డౌన్ 4.0 గురించి మోదీ సూచనప్రాయంగా చెప్పారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో లాక్‌డౌన్ 4.0 గురించి ప్రస్తావిస్తూ.. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దామని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ 4.0 పూర్తిస్థాయిలో భిన్నంగా ఉంటుందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనల మేరకు లాక్‌డౌన్ 4.0కు సంబంధించిన సమాచారం మే 18 కంటే ముందే అందరికీ తెలియజేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ 4.0 ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. ప్రధాని మోదీ వెల్లడించే నిబంధనలు ఎలా ఉంటాయి? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వేటికి అనుమతులు ఇస్తారు? తదితర విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
నాలుగో దశ లాక్‌డౌన్‌కు కావాల్సిన కొత్త రూపురేఖలు రూపొందించనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇప్పటికే కొంత మేర లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో పలు పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రధాని మోదీ ప్రసంగించిన మేరకు నాలుగో దశ లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా భారీ స్థాయిలో సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్-4కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తామని మోదీ చెప్పారు. కరోనా కారణంగా ఇప్పటికే చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూది నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్ 4.0 విధిస్తూనే కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.
ఎక్కువ రాష్ట్రాల అభిమతం అదే!
కరోనాను
కట్టడి చేయడంలో లాక్‌డౌన్ ఎంతగానో ఉపయోగపడిందని సోమవారం ప్రధానితో జరిగిన
సమావేశంలో ముఖ్యమంత్రులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా
చాలా మంది లాక్‌డౌన్ కొనసాగిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజా రవాణాకు సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపటంపైనా అభ్యంతరం వ్యక్తం
చేశారు. దీంతో సీఎంల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ లాక్‌డౌన్ 4.0
కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మోదీ ప్రసంగం ద్వారా
అర్థమవుతోంది. అయితే, వేటికి అనుమతులు ఉంటాయి. వేటికి నిరాకరిస్తారన్న
విషయం తెలియాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకూ వేచి
స్థానికం.. ఇకపై ఇదే మన నినాదం
నేటి అంతర్జాతీయ బ్రాండ్లన్నీ ఒకప్పుడు స్థానికమే!
మన స్థానిక ఉత్పత్తుల గురించి గర్వంగా చెబుదాం
భిన్నంగా 4వ లాక్‌డౌన్..18లోపు నిబంధనలు
కార్మికులు, రైతులు, ఎంఎస్‌ఎంఈలు,
మధ్యతరగతి వారి కోసం ప్యాకేజీ: ప్రధానిమోదీ
పూర్తి వివరాలను ప్రకటించనున్న ఆర్థిక మంత్రి
స్థానిక తయారీ, స్థానిక మార్కెట్లు, స్థానిక సప్లై చైన్ల ప్రాముఖ్యత గురించి ఈ కరోనా సంక్షోభం మనకు తెలియజేసింది. ఈ సంక్షోభ సమయంలో స్థానిక ఉత్పత్తులే మన అవసరాలను తీర్చాయి. స్థానిక ఉత్పత్తులకు మద్దతునివ్వడం అవసరమే కాదు.. అది మన బాధ్యత కూడా. స్థానికాన్నే మన జీవన మంత్రంగా చేసుకోవాలని కాలం మనకు నేర్పింది.
-ప్రధాని మోదీ
అన్ని వర్గాలకూ మేలు చేసేలా ప్యాకేజీ: మోదీ
న్యూఢిల్లీ, మే 12: ప్రపంచ దేశాలన్నింటినీ కమ్మేస్తూ ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి.. భారతదేశం స్వావలంబన సాధించడానికి ప్రధాని మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. దేశ ప్రజలనుద్దేశించి మంగళవారం రాత్రి ఆయన ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లో..
‘‘గత నాలుగు నెలలుగా ప్రపంచమంతా కరోనాపై పోరాడుతోంది. ఈ నాలుగు నెలల్లో 42 లక్షల మంది ఆ వైరస్ బారిన పడ్డారు. 2.75 లక్షల మందికి పైగా దాని వల్ల ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో సైతం చాలా మంది ప్రజలు తమ ఆప్తులను కోల్పోయారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి సంక్షోభాన్ని మనం మునుపెన్నడూ కనీవినీ ఎరుగం. ఈ పోరులో గెలిచి మనల్ని మనం కాపాడుకోవడానికి, ముందుకు సాగడానికి.. అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలను పాటించాలి. దృఢమైన సంకల్పమే ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి మనకు సాయం చేస్తుంది.
ఈ శతాబ్దం మనదే..
21వ శతాబ్దం మనదేననే మాట మనం గత శతాబ్ది నుంచి వింటున్నాం. ఇది మన కల కాదు. ఇది మనందరి బాధ్యత. కానీ, అందుకు మార్గం ఏమిటి? స్వావలంబన ఒక్కటే అందుకు (21 శతాబ్దాన్ని సొంతం చేసుకునేందుకు) మార్గమని ప్రపంచ ప్రస్తుత పరిస్థితి మనకు బోధిస్తోంది. కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మనదేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు కావట్లేదు. ఎన్-95 మాస్కులు మాత్రం కొద్దిమొత్తంలో తయారయ్యేవి. కానీ, ఇప్పుడు మనం రోజుకు 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్-95 మాస్కులు సొంతంగా ఉత్పత్తి చేసుకునే స్థితిలో ఉన్నాం. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం వల్లే భారత్ ఇలా చేయగలిగింది. మనదేశాన్ని స్వావలంబన కలిగిన దేశంగా మార్చేందుకు అదే ఉపకరిస్తుంది. భారతదేశ స్వావలంబనలో ప్రపంచ శాంతి, సహకారం, ఆనందం కూడా ఇమిడి ఉంటాయి. ‘స్వావలంబన భారత్’ అనే అద్భుతమైన భవనం ఐదు పునాదులపై నిలబడి ఉంటుంది. అవేంటంటే.. ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత వ్యవస్థలు, చైతన్యవంతమైన ప్రజానీకం, గిరాకీ.
ఈ కరోనా సంక్షోభ వేళ నేనొక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఇది ‘స్వావలంబన భారత్ ఉద్యమం’లో కీలకపాత్ర పోషించనుంది. కరోనాపై పోరులో భాగంగా గత ప్రకటనలు, ఆర్బీఐ నిర్ణయాలు, ఈ కొత్త ప్యాకేజీ అన్నీ కలుపుకొంటే దాని విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లు. ఇది మన జీడీపీలో 10 శాతం. ఇది అన్ని వర్గాలకూ మేలు చేసే ప్యాకేజీ. ఈ ప్యాకేజీ.. మనదేశంలో కోట్ల మందికి ఉపాధి కల్పించే కుటీర, సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా పరిశ్రమల కోసం. ఈ ప్యాకేజీ.. ఎండనకా, వాననకా రాత్రింబవళ్లూ శ్రమించే మన కార్మికులు, కర్షకుల కోసం. ఈ ప్యాకేజీ.. నిజాయతీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వారి కోసం. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలను మన ఆర్థిక మంత్రి మీకు తెలియజేస్తారు. గత ఆరేళ్లుగా చేపట్టిన సంస్కరణల వల్లే ఇంత సంక్షోభ సమయంలో కూడా మన వ్యవస్థలు ఇంత సమర్థంగా కనిపిస్తున్నాయి. ఆ సంస్కరణలను మరింత విస్తృతం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ సంస్కరణలు మన ‘భారత్‌లోనే తయారీ’ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
అందరికీ..
కరోనా సంక్షోభం కారణంగా భారీ వ్యవస్థలు సైతం కంపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని వీధివ్యాపారులు, కార్మికులు, ఇళ్లల్లో పనులు చేసుకునేవారు చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. వారిని బలోపేతం చేయడం, వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం మన విధి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. పేద కార్మికులు, వలస కూలీలు, పశుల కాపరులు, జాలర్లు.. సంఘటిత, అసంఘటిత రంగాలవారు.. ఇలా అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని వారికి మేలు కలిగించేలా ఆర్థిక ప్యాకేజీలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించబోతున్నాం.
స్థానికానికి మద్దతు..
స్థానిక ఉత్పత్తులకు మద్దతునివ్వడం అవసరమే కాదు.. అది మన బాధ్యత కూడా. స్థానికతనే మన జీవన మంత్రంగా చేసుకోవాలని కాలం మనకు నేర్పింది. మనం ఇప్పుడు చూసే చాలా అంతర్జాతీయ బ్రాండ్లు ఒకప్పుడు స్థానికమే. అవి తయారైన చోట స్థానికులు వాటికి మద్దతు ఇవ్వడం వల్లనే అవి పెరిగాయి. అంతర్జాతీయ ఉత్పత్తులుగా పేరొందాయి. కాబట్టి, ఇక నుంచి భారతీయులందరూ కూడా స్థానిక ఉత్పత్తులకు మద్దతు పలకాలి (వోకల్ ఫర్ లోకల్). అంటే స్థానిక ఉత్పత్తులను కొనడంతోనే సరిపెట్ట కూడదదు. వాటి గురించి మనం ప్రపంచం మొత్తానికీ గర్వంగా చెప్పాలి.
ఈ జాగ్రత్తలు పాటిద్దాం..
కరోనా దీర్ఘకాలంపాటు మన జీవితాల్లో భాగం కానుందని శాస్త్రజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాస్కులు ధరిద్దాం. ఆరడుగుల దూరం పాటిద్దాం. మన లక్ష్యాలను సాధిద్దాం. రాష్ట్రాల నుంచి అందిన సలహాలు, సూచనల మేరకు నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనలను విభిన్నంగా రూపొందించి.. ఆ వివరాలను మే 18కన్నా ముందు తెలియజేస్తాం. ఆ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాపై పోరాడుతూ మనం ముందుకు సాగుతామని విశ్వసిస్తున్నాను

0 Response to " కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ 4.0: ప్రధాని మోదీ "
Post a Comment