రాష్ట్రంలో మొత్తం 3042 పాజిటివ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా
98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,370
శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మంది కోవిడ్-19 బారిన పడినట్లు నోడల్ అధికారి
విడుదల చేసిన బులెటిన్‌లో
పేర్కొన్నారు. 43 మంది కోవిడ్ నుంచి కోలుకుని
డిశ్చార్జ్ అవగా.. ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3042 పాజిటివ్
కేసులకు గాను 2135 మంది డిశ్చార్జ్ కాగా, 62 మంది మరణించారు. ప్రస్తుతం 845
మంది చికిత్స పొందుతున్నారు.


0 Response to "రాష్ట్రంలో మొత్తం 3042 పాజిటివ్"
Post a Comment