11,122పోస్టుల భర్తీకి ప్రతిపాదన

*💁‍♀️11,122పోస్టుల భర్తీకి ప్రతిపాదన*

*🔰ఆర్ధికశాఖ వద్దకు వైద్య ఆరోగ్య శాఖ ఫైలు*

🔰 అమరావతి : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే మంజూరైన పోస్టుల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు, అదనపు పోస్టులను కూడా ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఆర్థికశాఖ వద్ద ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్ట్ పద్దతిపై కొంతమంది వైద్య నిపుణులను నియమించగా, తాజాగా 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది.ఇప్పటికే అనుమతి పొందిన పోస్టుల్లో ఖాళీలు 4,455 ఉన్నాయి. మరో పోస్టుల అదనంగా కావాలంటూ ప్రతిపాదించారు. 



🔰వైద్య విద్య సంబంధించి ఖాళీగా ఉన్న 935 పోస్టుల్లో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్లను, 329 స్టాఫ్ నర్సులను, 57 పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని, 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కాంట్రాక్ట్ పద్దతిపై, 226 ఇతర పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదించగా, వైద్య విద్య లో అదనపు పోస్టులకు సంబంధించి 800 బోధనా సిబ్బందిని, 2,766 నర్సింగ్ స్టాఫీను, 330 పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ విధానంలో, 315 మంది ఇతరులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో నియమించేందుకు ప్రతిపాదించారు. వైద్య విధాన పరిషతకు సంబంధించి 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పోస్టులను రెగ్యులర్ విధానంలో, 26 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 900 స్టాఫ్ నర్సులు, పది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను, 80 గ్రేడ్-2 ఫార్మసిస్ట్, 46 పారామెడికల్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంతో 434 ఇతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఇదే విభాగంలో 314 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (గైనకాలజిస్ట్), 78 అనస్థీషియా పోస్టులను రెగ్యులర్ విధానంతో 249 డిఇఓ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంతో కొత్తగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యం , కుటుంబ సంక్షేమ సంచాలకుని విభాగంగాలో కూడా ఖాళీగా ఉన్న 1,724 పోస్టులను భర్తీ చేయాలని, మరో 1 పోస్టుల అదనంగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు. 


ఇలా మొత్తం 11,122 పోస్టులకు సుమారు 535 కోట్ల వరకు ఏటా ఖర్చు అవుతుందని కూడా ప్రాధమికంగా అంచనా వేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "11,122పోస్టుల భర్తీకి ప్రతిపాదన"

Post a Comment