‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఆదివారం ప్రసంగo

న్యూఢిల్లీ : కోవిడ్ - 19 మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటం గురించే ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.



ఈ మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో ఒకరి నొకరు ఎలా సహాయపడుతూ ఉన్నారన్న విషయాలను కూడా చర్చించుకుంటారని తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఆదివారం ప్రసంగించారు

‘ప్రపంచం ప్రపంచమే నేడు ఈ మహమ్మారితో పోరాడుతున్నాయి. భవిష్యత్తులో ఈ మహమ్మారి గురించి ప్రస్తావించుకున్నపుడు, నెమరు వేసుకున్నపుడు ప్రపంచ దేశాలు కచ్చితంగా భారతదేశం మహమ్మారికి వ్యతిరేకంగా సలిపిన పోరాటం గురించి చర్చించుకుంటాయి, నెమరు వేసుకుంటాయి’’ అని ధీమా వ్యక్తం చేశారు.


ఇంతటి క్లిష్ట సమయంలో దేశం నలుమూలలా ప్రజలందరూ ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నారని ఆయన ప్రశంసించారు. పేదలకు అన్న వితరణ, నిత్యావసరాలను సమకూర్చడం, లాక్‌డౌన్ ను పాటించడం, వైద్య పరికరాల విషయంలో స్వదేశీ ఉత్పత్తుల కోసం ఆసుపత్రలను నిర్వహించడం... ఇలా దేశం మొత్తం మహమ్మారిపై విజయం సాధించడంలో ఒకే దిశలో కదులుతోందని హర్షం వ్యక్తం చేశారు.



మహమ్మారి వ్యతిరేక పోరాటాన్ని ప్రజలే ముందుండి నడిపిస్తున్నారని, అధికార గణం, ప్రజలకు పరస్పరం సహకారంతో ముందుకు సాగుతున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు

 మన్ కి బాత్ లోని ప్రధానాంశాలు ఇవే

  • కరోనాపై యుద్ధంలో ప్రతి పౌరుడు ఓ సైనికుడే.
  • కరోనా పై మనం సరైన రీతిలో యుద్ధం చేస్తున్నాం.
  • కరోనాపై దేశ ప్రజలంతా యుద్ధం చేస్తున్నారు.
  • దేశమంతా ఒకే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
  • గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటిస్తున్నారు.
  • ఈ యుద్ధంలో ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు.
  • ఓ ఒక్కరు ఆకలితో ఉండకుండా రైతులు పోరాడుతున్నారు.
  • దేశం కోసం సేవ చేయండి.
  • కోవిడ్ వారియర్స్ కు సహకరిద్దాం.
  • కరోనా అంతం తరువాత కొత్త ఇండియాను చూస్తాం.
  • కోవిడ్ వారియర్స్ పై దాడి చేస్తే సహించేది లేదు.
  • డాక్టర్లు, పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు.
  • దాడి చేసిన వాళ్లపై ప్రత్యేక చట్టం కింద శిక్షిస్తాం.
  • శానిటేషన్ వర్కర్లు, పోలీసులకు దేశం సెల్యూట్ చేస్తుంది.
  • కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా సహకరిస్తున్నాయి.
  • కరోనా రహిత భారత్ కోసం వైద్యులు రేయి పగలు కష్టపడుతున్నారు. రేల్వే సిబ్బంది సేవలు ప్రశంసనీయం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఆదివారం ప్రసంగo"

Post a Comment