నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
దిల్లీ:
కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్వహించనున్నారు.
కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడం, వలస కూలీల కదలికలు,
తబ్లీగీ జమాత్ గత నెలలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న
వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపడం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు
వచ్చే అవకాశాలు ఉన్నట్లు
బుధవారమిక్కడ అధికారిక వర్గాలు తెలిపాయి.
నిత్యావసరాల కొరతా రాకుండా చూడడంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని వివరించాయి
0 Response to "నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్"
Post a Comment