హాట్‌స్పాట్స్‌లో లాక్‌డౌన్‌ కొనసాగింపు



దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్‌ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. దేశంలో కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అంశంపై హోంమంత్రి అమిత్‌షాతో కలిసి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మొత్తం 9 మంది సీఎంలు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముగింపునకు ఐదుగురు సీఎంలు మొగ్గు చూపగా.. పొడిగించాలని నలుగురు సీఎంలు కోరినట్లు సమాచారం



పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం. అయితే కొవిడ్‌ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు.  గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల వారీగా ఈ ప్రణాళికలు ఉండాలని చెప్పారు


ఆర్థికంపై ఆందోళనొద్దు
కరోనాపై పోరుకు మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావం చూపుతున్నాయని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. వేలమందిని రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యమని, నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధి హామీ, కొన్ని పరిశ్రమలు పనులు ప్రారంభమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందొద్దని సూచించారు. మన ఆర్థిక వ్యవస్థ బాగుందని ఈ సందర్భంగా సీఎంలతో పేర్కొన్నట్లు సమాచారం.

ఢిల్లీ: కరోనా ప్రభావిత ప్రాంతాలు, రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్‌లో తేల్చి చెప్పినట్లు సమాచారం. లాక్‌డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల విభజన చేసుకోవాలని మోదీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు సమాచారం. అయితే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడగింపు వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.


దేశంలో ఇంకా కరోనా కేసులు తమ ఉనికిని చాటుతూనే ఉన్న సందర్భంలో మే3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడగించాలని మోదీకి సూచించినట్లు సమాచారం. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్నే డిమాండ్ చేశారు. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా మాట్లాడుతూ... మే 3 తర్వాత కూడా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపుకే మొగ్గు చూపుతున్నామని మోదీకి తెలిపినట్లు సమాచారం. అయితే గ్రీన్‌ జోన్లు, కోవిడ్ - 19తో ప్రభావితం కాని జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్ ఎత్తేస్తామని సంగ్మా అన్నారు


2 గజాల దూరం మంత్రం కావాలి

వేల మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై సుదీర్ఘంగా చర్చజరిగింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీకి సీఎంలు పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే  ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు. గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి.. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్‌డౌక్‌ కారణంగా  ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడటంతో.. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " హాట్‌స్పాట్స్‌లో లాక్‌డౌన్‌ కొనసాగింపు"

Post a Comment