ఫేస్‌బుక్ .. వీడియో కాన్ఫరెన్స్ కోసం కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ప్రధాన పోటీదారులను ఎదుర్కోవడంలో సరికొత్త ఎత్తుగడలకు మారుపేరైన ఫేస్‌బుక్.. తాజాగా జూమ్ యాప్‌ను ఢీకొట్టేందుకు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌తో ముందుకొచ్చింది.
‘మెసెంజర్ రూమ్స్’ పేరుతో తన మెసెంజర్ యాప్‌కు కొత్తగా వీడియో కాన్ఫరెన్స్ వెర్షన్‌ను జోడించింది.
టైమ్ లిమిట్‌తో సంబంధం లేకుండా ఒకేసారి 50 మంది వరకు ఇందులో సమావేశం కావచ్చు.
జూమ్ యాప్ ఫ్రీ వెర్షన్‌లో 100 మంది వరకు సమావేశమయ్యే అవకాశం ఉన్నా... గరిష్టంగా 40 నిమిషాల వరకే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఫేస్‌బుక్ తీసుకొచ్చిన వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌లో మరో విశేషం కూడా ఉంది. తాము సమావేశం కావాలనుకున్న వాళ్లకు ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా.. వినియోగదారులు తమ ‘మెసెంజర్ రూమ్స్’లోకి వారిని ఆహ్వానించవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధించడంతో కొద్ది నెలలుగా వీడియో కాలింగ్ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. జూమ్ లాంటి యాప్‌లలో వర్చువల్ సమావేశాలతో పాటు అనుకూలమైన ఫోటో బ్యాగ్రౌండ్లకు వీలుండడంతో లక్షలాది మంది వినియోగదారులు వీటికి ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అభివృద్ధి చేసిన ఫేస్‌బుక్.. త్వరలోనే మెసెంజర్ రూమ్స్‌కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని తెలిపింది. ప్రస్తుతం మెసెంజర్‌కు మాత్రమే పరిమితమైన ‘రూమ్స్’ను త్వరలోనే మిగతా అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కూడా ప్రవేశపెడతామని ఫేస్‌బుక్ తెలిపింది.
వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల ద్వారా రోజుకు 70 కోట్లకు పైగా వినియోగదారులు ఇప్పుడు వీడియో కాల్స్ వినియోగిస్తున్నట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది.
0 Response to " ఫేస్‌బుక్ .. వీడియో కాన్ఫరెన్స్ కోసం కొత్త ఫీచర్"
Post a Comment