కరోనా కట్టడి: ప్రధానికి వివరించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వారికి తెలిపారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం వివరించారు. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 111 కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయినవారేనని వీడియో కాన్ఫరెన్స్‌ సీఎం స్పష్టం చేశారు



ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల వారిగా సర్వే చేపడుతున్నట్లు, అనుమానితులను నిర్బంధం కేంద్రాలకు తరలించి వైద్య సదుపాయం అందిస్తున్నట్లు ప్రధానికి వివరించారు. అలాగే కోవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేయాలని సీఎం జగన్‌ కోరారు. కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు సరైన సంఖ్యలో వైద్య పరికరాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రధానితో సమావేశంలో సీఎం జగన్‌తో పాటు.. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కరోనా కట్టడి: ప్రధానికి వివరించిన సీఎం జగన్‌"

Post a Comment