ప్రధాని మోదీ ట్వీట్.. రేపు ఉదయం 9 గంటలకు...

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రేపు ఉదయం 9 గంటలకు ఓ చిన్న వీడియో మెసేజ్‌ను మీతో పంచుకుంటానని ఆయన ట్వీట్ చేశారు



. అయితే.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ ట్వీట్ చేయడంతో ఆయన ఏం చెప్పబోతున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ గురించి కీలక విషయాన్ని వెల్లడిస్తారా లేక ఇదేమీ కాకుండా.. యోగాకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.




 దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని కొందరు, కేంద్రానికి ఆ ఆలోచన లేదని మరికొందరు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రధాని మోదీ ట్వీట్.. రేపు ఉదయం 9 గంటలకు..."

Post a Comment