టెక్నాలజీ: జీ మెయిల్ లో ఈ ఫీచర్స్ గురించి మీకు తెలుసా..?
రీస్టోర్ అడ్రస్.. ఒకవేళ మీరు మొబైల్ డివైజ్‌లో నుంచి కాంటాక్ట్స్ డిలీట్ చేసినపుడు గూగుల్ అకౌంట్‌లోని కాంటాక్ట్ కూడా డిలీట్ అవుతుంది. అయితే డిలీట్ అయిన కాంటాక్ట్‌ను రీస్టోర్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసిన 30 రోజుల్లోగా రికవరీ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్‌లోకి వెళ్లి మోర్‌పై క్లిక్ చేసి రీస్టోర్ కాంటాక్ట్స్‌ని ఎంచుకోవాలి. రీస్టోర్‌పై క్లిక్ చేస్తే డిలీట్ అయిన కాంటాక్ట్స్ రీస్టోర్ అవుతాయి.
జీమెయిల్ ఆఫ్‌లైన్.. ఇంటర్నెట్ లేకపోయినా మెయిల్ చదవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే గూగుల్ క్రోమ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అందుకు ముందుగా జీమెయిల్ ఆఫ్‌లైన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎనబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ పై క్లిక్ చేస్తే ఎన్ని రోజుల మెసేజెస్ కావాలంటే అన్ని సింక్ చేసుకునే అవకాశం ఉంటుంది
0 Response to "టెక్నాలజీ: జీ మెయిల్ లో ఈ ఫీచర్స్ గురించి మీకు తెలుసా..?"
Post a Comment