మూడో విడత వలంటీర్ల నియామకం
20 నుంచి 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వలంటీరు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కొంతమంది వలంటీర్లు విధులకు గైర్హాజరవడం, కొందరు కొవిడ్-19 సమయంలో రాజీనామా చేయడంతో వలంటీర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. కొవిడ్-19 సందర్భంగా డోర్ డెలివరీ సేవలు అందించాల్సిన నేపథ్యంలో ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని మండలాల ఎంపీడీవోలను ఆదేశిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు మార్గదర్శకాలను జారీచేశారు.
వలంటీర్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ నెల 20న అన్ని మండలాలు, పట్టణాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్లు జారీచేయాలని, 20 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించి,
25న పరిశీలించాలని ఆదేశించారు. 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆ మూడు రోజుల్లోనే ఎంపిక జాబితా ఇవ్వాలన్నారు. ఎంపికైన వలంటీర్లు మే 1 నుంచి విధుల్లో చేరాలని పేర్కొన్నారు
Additional information
*🌺వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఉత్తర్వులు🌺*
*🌺20వ తేదీన నోటిఫికేషన్ జారీ*
*🌺మే 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తి*
*: గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు వాలంటీర్ల, సచివాలయ విభాగ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు శనివారం సూచించారు. కొవిడ్-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితోపాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
*🌺 జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. 27- 29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.*
*🌺దరఖాస్తు ప్రక్రియ ఇలా..🌺*
*🌺2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు పూర్తయి 35 ఏళ్ల నిండని వారంతా ఆన్‌లైన్‌లో https://gswsvolunteer,apcfss.in/ దరఖాస్తు చేసుకోవాలి.*
*🌺ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్‌వోఆర్) అమలు చేయనున్నారు.*
*🌺ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.*
0 Response to "మూడో విడత వలంటీర్ల నియామకం"
Post a Comment