తెలంగాణ తెలంగాణలో మే 7వరకూ లాక్‌డౌన్: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.


అంతేకాదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉండవని సీఎం ప్రకటించారు. కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే..

రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

లాక్‌డౌన్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే మే 7వరకూ కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ లాక్‌డౌన్ పొడిగింపుపై సర్వే చేశామని, పలు మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయని సీఎం చెప్పారు. అభిప్రాయ సేకరణ అనంతరం కేబినెట్‌లో చర్చించాక మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలంగాణ తెలంగాణలో మే 7వరకూ లాక్‌డౌన్: సీఎం కేసీఆర్"

Post a Comment