ఏపీలో 603కు చేరిన కరోనా positive

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో 31 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 603కు చేరింది.

ఇప్పటి వరకు చికిత్స పొంది 42 మంది డిశ్ఛార్జి అయ్యారు. 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 546 మంది చికిత్స పొందుతున్నారు

ఇవాళ నమోదైన పాజిటివ్‌ కేసుల్లో కృష్ణా జిల్లాలో 18, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 2,తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 603కు చేరిన కరోనా positive"

Post a Comment