ఎపిలో 405కి పెరిగిన పాజిటివ్ కేసులు

కొత్తగా గుంటూరులో 17 కేసులు 
* కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు 
అమరావతి : కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలోశుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం, మొత్తం కేసులు 405కు చేరాయని పేర్కొంది.



"రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం మరియు కడప జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.



కొత్తగా నమోదైన 24 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి పెరిగింది" అని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణలోని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతా వెల్లడించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎపిలో 405కి పెరిగిన పాజిటివ్ కేసులు"

Post a Comment