మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్: మోదీ
యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగింపుపై అందరూ ఊహించినట్టే జరిగింది. కొవిడ్-19ను కట్టడి చేసేందుకు మరికొన్ని వారాలు లాక్‌డౌన్ పొడిగించాలంటూ దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశం లాక్‌డౌన్‌లోనే కొనసాగనుంది. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు. ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్‌డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. లాక్‌డౌన్ కష్టాలు తట్టుకుని ప్రతిఒక్కరూ దేశాన్ని కాపాడుకుంటున్నారు. దేశ ప్రజలు ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నారో నేను అర్థం చేసుకోగలను. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. ఎన్నో కష్టాలు పడి భారత్‌ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు...’’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
దేశంలోకి ఒక్క కరోనా కేసు రాక ముందే దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేశామనీ.. కరోనా మహమ్మారిగా మారక ముందే చర్యలు చేపట్టామని ప్రధాని గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ అర్పించిన ఆయన... భారత ప్రజలంతా సామూహిక బలాన్ని ప్రదర్శించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ‘‘కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుంది. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసింది. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయి...’’ అని ప్రధాని పేర్కొన్నారు
న్యూఢిల్లీ : మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.
మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు
కరోనాపైపోరులో ప్రధాని నరేంద్ర మోడీ సప్తపదులు ఇవే!
గతంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగుస్తుండడంతో, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మాటలాడుతూ, ప్రజలను ఈ కరోనా పై పోరులో తన తోడు రావాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై ఇన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించిన ప్రజలు మరో ఏడూ సూత్రాలు పాటిస్తామని మాటివ్వాలని కోరారు.
1. వయసు పైబడినవారిని కాపాడుకోవాలి. ఇంట్లోని వృద్దులపట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని, గతంలో రోగాల బారిన పడిన హిస్టరీ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి కాపాడుకోవాలి. .
2. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ అనే లక్ష్మణ రేఖలను పాటించాలి.
3. పేస్ మాస్కును ధరించాలి, దానికోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లను వాడమని చెప్పారు
3. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
4. కరోనా నియంత్రణకోసం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇతరులను కూడా డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
5. పేదలకు ప్రతిఒక్కరు ఈ సంకట సమయంలో చేతనైనంత సహాయం చేయాలనీ సూచించారు.
6. సహ ఉద్యోగులపట్ల శ్రద్ద చూపడంతోపాటు, ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయవద్దు అని కోరారు.
7. ప్రభుత్వ అధికారులను, పోలీసులను, వైద్య సిబ్బందిని గౌరవించాలని మోడీ కోరారు.
ఈ సప్తపదిని పాటిస్తూ ప్రజలంతా ఈ కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలాలని, వీటిద్వారానే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చని మోడీ గారు తెలిపారు
0 Response to "మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్: మోదీ"
Post a Comment