ఏప్రిల్ 20 నుంచి టోల్ ట్యాక్స్‌ల వసూలు: కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: ఏప్రిల్ 20వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులపై టోల్ ట్యాక్స్‌లు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కి కేంద్ర హోం శాఖ అదేశాలు జారీ చేసింది. కేంద్రం లాక్‌డౌన్‌ను కేంద్రం మే 3వ తేదీ వరకూ పొడిగించినా.. ఏప్రిల్ 15వ తేద నుంచి అన్ని టోల్‌గేట్ల వద్ద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 



లాక్‌డౌన్ పొడిగించినప్పటికీ.. పలు ముఖ్యమైన పరిశ్రమలు తమ కార్యకలాపాలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభించే కేంద్రం హోం శాఖ అవకాశం ఇచ్చింది. అయితే వినియోగదారుల ద్వారా వచ్చిన టోల్ ట్యాక్స్‌లు ప్రభుత్వ ఖజానాకు చెందుతాయని, తద్వారా ఎన్‌హెచ్‌ఏఐకి కూడా బడ్జెట్ ద్వారా ఆర్థికంగా సహకారం లభిస్తుందని హోం శాఖ పేర్కొంది. 


అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ కోరింది. ఇప్పటికే అర్థిక సంక్షోభంలో ఉన్న తన పరిశ్రమ దీని కారణంగా మరిన్ని కష్టాలు ఎదురుకుంటుందని ఛైర్మన్ కుల్తరన్ సింగ్ అత్వాల్ అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏప్రిల్ 20 నుంచి టోల్ ట్యాక్స్‌ల వసూలు: కేంద్ర హోంశాఖ"

Post a Comment