పరీక్షా సమయం 2 గంటలే
పరీక్షా సమయం 2 గంటలే
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ప్రస్తుత విధానమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వే షించాలని యూజీసీ కమిటీ సూచించింది
. ఇందులో భాగంగానే ఓపెన్ బుక్ పాలసీ, ఓపెన్ ఛాయిస్ అసైన్‌మెంట్, ప్రజెంటేషన్ ఆధారంగా విద్యార్థు లను ఉత్తీర్ణులు చేసే విధానాలను పరిశీలించాలని సూచించింది
. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించేందుకు యూజీసీ హరియాణి వర్సిటీ వీసీ ఆర్‌సీ కుహడ్ నేతృత్వంలో కమిటీ వేసిన విషయం తెలిసిందే.
ఈ కమిటీ రెండు రోజుల క్రితం యూజీసీకి తన నివేదికను సమ ర్పించింది. పలు సిఫారసులను కమిటి ఆ రిపోర్చలో పొందుపరిచింది. పరీ క్షల నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
అవసర మైతే పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించుకోవచ్చు. అలాగే షిప్పల వారీగా పరీక్షల నిర్వహణను పరిశీలించాలి పేర్కొంది.
0 Response to "పరీక్షా సమయం 2 గంటలే"
Post a Comment