‘15వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం’
సాక్షి, అమరావతి : నాడు- నేడు కార్యక్రమం కింద మొదటి దశలో
15 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు
కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష
సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ..
లాక్‌డౌన్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు
నిర్వహిస్తున్నామని, విద్యార్థులంతా వీటిని వినియోగించుకోవాలని కోరారు.
యూనివర్సీటీలలో కూడా ఆన్‌లైన్ క్లాసు చెప్పే ప్రయత్నాలు
చేస్తున్నారన్నారు.
గేట్ కోచింగ్ కూడా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేందుకు
జేఎన్‌టీయూ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు
స్కూళ్లు తెరిచాక విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్స్, బుక్స్‌ను సిద్ధం
చేస్తున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు
0 Response to "‘15వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం’"
Post a Comment