పాఠశాలా... షాపింగ్‌ మాలా?





 పాఠశాలా... షాపింగ్‌ మాలా?

ప్రైవేట్‌ బడుల్లో ప్రతిదీ వ్యాపారమే
విద్యాసామగ్రి అంతా అక్కడే కొనాలి
తల్లిదండ్రులపై అదనపు భారం
ఈనాడు, హైదరాబాద్‌




ష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు.. మరోవైపు విద్యాసామగ్రి  కొనుగోళ్లను తప్పనిసరి చేస్తూ తల్లిదŸండ్రులపై అదనపు భారం మోపుతున్నాయి. వారు చెప్పిందల్లా కొనాల్సిందే. లేదంటే టీసీ ఇస్తాం వెళ్లిపోండని  హెచ్చరిస్తున్నాయి. వీటిపై గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆడిందే ఆటగా మారింది.

ఇదీ బడిలో వ్యాపారం
విద్యార్థులకు అవసరమైన ఏ వస్తువైనా పాఠశాల స్టోర్‌లో కొనాల్సిందే. ఏకరూప దుస్తులు, బూట్లు, టై, బెల్టు, పుస్తకాలు, బ్యాగులు అన్నీ పాఠశాలలోనే అమ్ముతున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పుస్తకాలు బడి ప్రాంగణంలో అమ్మినా తల్లిదండ్రులు బయట కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలి. అవి లభించే దుకాణాల చిరునామాలను తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఈ నిబంధనలను యాజమాన్యాలు పాటించట్లేదు. పైగా పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ట్యూషన్‌ ఫీజులు కాకుండా ఒక్కో విద్యార్థి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఆయా విద్యాసామగ్రిపై ఖర్చు చేయాల్సి వస్తోంది

హైదరాబాద్‌ అమీర్‌పేట ప్రాంతంలోని ఓ ఐసీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో విద్యార్థులు విద్యాసామగ్రి అంతా అక్కడే కొనుగోలు చేయాలి. యూనిఫాం, బూట్లు, టై, బెల్టు లాంటివి రెండు జతలు ఏటా కొత్తవి కొనాల్సిందే.
బాచుపల్లిలోని ఓ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో ప్రతి విద్యార్థీ బడిలోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం తినాలి.
ఓ ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాల యాజమాన్యం స్వయంగా ముద్రించిన మెటీరియల్‌ను మాత్రమే  కొని చదవాలి.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వాడాలి. వాటినీ కొనుగోలు చేయిస్తారు. పిల్లలు చదవాల్సింది మాత్రం పాఠశాలలు ముద్రించిన పుస్తకాలనే.
పలు పాఠశాలలు ప్రత్యేకంగా క్రీడా బూట్లు, అందుకను గుణంగా దుస్తులు కొనుగోలు చేయిస్తున్నారు.
కొన్ని యాజమాన్యాలు బ్లేజర్‌ (కోట్‌) వేసుకునేలా డ్రెస్‌ కోడ్‌ నిబంధన విధిస్తున్నాయి. ఒక్కో జత ఖరీదు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉంది. రెండేళ్లకు ఒకసారి కొత్తవి కొనుగోలు చేయాలి.
కొద్ది సంవత్సరాలుగా అధిక శాతం పాఠశాలలు కలర్‌ డేను జరుపుతున్నాయి. ఆ రోజు రెడ్‌ కలర్‌ డే జరిపితే ఆ రంగు దుస్తులు ధరించి వెళ్లాలి. ఏడాదిలో మూడు నాలుగు సార్లు ఇలాంటివి ఉంటాయి. ఇక టూర్లు పేరిట కూడా అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇలాంటి నిబంధనలు, షరతుల వల్ల ఏటా రూ.వేలల్లో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలా... షాపింగ్‌ మాలా?"

Post a Comment