టైం స్లాట్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం
కరోనా కట్టడికి తితిదే చర్యలు
తిరుపతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులందరికీ టైం స్లాట్ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. మంగళవారం నుంచి భక్తులను కంపార్టుమెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా తమవెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. గంటకు 4500 మంది శ్రీవారిని దర్శించుకొనేలా టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు
లోకశాంతి కోసం యాగం నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవసహిత ధన్వంతరి మహాయాగం చేపడతామన్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగుతుందని చెప్పారు
0 Response to "టైం స్లాట్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం"
Post a Comment