ఇవి ప్రత్యేక సెలవులు
*🚩ఇవి ప్రత్యేక సెలవులు..*
*🌴గడప దాటకుంటేనే మేలు*
*సద్వినియోగం చేసుకోవాలి*
_ఇంటి పట్టున ఉండేలా చూసుకోవాలి_
*మన భైరిపురం*
సెలవులు వచ్చాయంటే చాలు చెప్పలేనంత సంతోషం. అయితే ఇవి పండగలు, వేసవి సెలవులు కాదు.. కరోనా సెలవులు. ఈ వైరస్ ప్రపంచాన్నే భయపెడుతోంది. దీని ధాటికి వివిధ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 31 వరకు సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు మూసి వేశారు. అయితే ఈ అప్రకటిత సెలవులతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయితే చాలా మంది పిల్లలు కాస్త సమయం దొరికితే చాలు చరవాణికి అతుక్కుపోతారు. దీని వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. కరోనా ప్రభావంతో ఎక్కడికి వెళ్లలేము. ఇంట్లోనే ఉంటూ ఈ సెలవుల సద్వినియోగం, కార్యచరణపై ‘మనభైరిపురం’ ప్రత్యేక కథనం.
సాధారణంగా వేసవి సెలవులు వస్తే బంధువులు, పట్టణాల్లో ఉండే వారు సొంత ఊర్లకు వెళతారు. అనుకోకుండా దాదాపు 15 రోజులు సెలవులు వచ్చాయి. విద్యాసంవత్సరం ఇంకా ముగియలేదు. ఈ సమయంలో పిల్లలను షాపింగ్‌లు, విహార యాత్రలు తిప్పలేని పరిస్థితి. చిన్నారులు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇంటి పట్టునే పిల్లలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. పుస్తక పఠనం, నీతి కథలు వినిపించాలి. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*📒పుస్తక పఠనం అలవాటు చేయాలి*
👉ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు వీలైనంత వరకు చరవాణి ఇవ్వకపోవడమే మేలు. దానికి బదులుగా పుస్తకాలు తెచ్చి పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి. నీతి కథలు, స్ఫూర్తి గాథలు చదివే విధంగా ప్రోత్సహించాలి. తద్వారా చిన్నారులు ఇంటిపట్టునే ఉండే అవకాశం ఉంది.
*చదరంగం, క్యారంతో చురుకుదనం*
ఏ పని చేయాలన్నా మెదడు చురుకుగా పని చేయాలి. చదువుకునే విద్యార్థులకు ఇది చాలా అవసరం. మెదడును కళ్లు, చేతులతో అనుసంధానం చేసేందుకు ఎంచుకోవాల్సిన క్రీడలు ఉన్నాయి. చదరంగం, క్యారం, టేబుల్ టెన్నీస్ లాంటి ఆటల ద్వారా పూర్తి స్థాయిలో మెదడుకు పదును పెంచుకోవచ్ఛు ఇంటి పట్టునే ఉండి ఆడుకోవచ్ఛు
*సంప్రదాయ ఆటలతో ఆరోగ్యం..*
సంప్రదాయ ఆటలను పిల్లలు మరిచిపోతున్నారు. సెలవుల్లో వీటిని ఆడేందుకు అవకాశం ఉంది. అబ్బాయిలు గోళీలు, చిర్రగోనే, అమ్మాయిలు అష్టాచెమ్మా, తొక్కుడు బిళ్ల, తదితర ఆటలు ఆడటం వల్ల మన ఆటలు తెలియడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. ఇవి అంతటా ఆడుకోవచ్ఛు దీని వల్ల చిన్నారులు చాలా హుషారుగా ఉంటారు.
*🏝️సతతం.. హరితం*
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడానికి ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ఉమ్మడి జిల్లాలోని ఉన్న విద్యార్థులు రోజుకు ఒక మొక్క నాటినా కొన్ని లక్షల మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. దీంతో 15 రోజుల్లో పచ్చ సంపద వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దొరికిన సమయాన్ని హరితహారానికి ఉపయోగిస్తే బాటుంటుంది.
*🎋సరదా మాటున ప్రమాదం పొంచి ఉంటుంది*
ప్రస్తుతం సెలవుల్లో చిన్నారులు సరదాగా బావుల్లో, చెరువుల్లో ఈతకు వెళతామని మారం చేస్తారు. ఈ సరదా మాటున ప్రమాదం పొంచి ఉంటుంది. భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదన్న ఉద్ధేశంతోనే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి.
*👉ఇలా చేస్తే మేలు...*
* ముందుగా చిన్నారులకు సెలవులకు కారణాలు విశ్లేషించాలి. ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌తో ఏర్పడే అనర్థాలను వివరిస్తూ అప్రమత్తం చేయాలి.
* రాబోయే పరీక్షల దృష్ట్యా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా మానసికంగా సన్నద్ధం చేయాలి.
* వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో నిత్యం ప్రణాళిక ప్రకారం ఆయా సబ్జెక్టులు పునఃశ్చరణ చేసుకునేలా చేయాలి. పుస్తకాలతో కొంత సమయం కుస్తీ పట్టేలా చూడాలి.
0 Response to "ఇవి ప్రత్యేక సెలవులు"
Post a Comment