వర్క్‌ ఎక్కడి నుంచి?

“వర్క్‌ ఎక్కడి నుంచి?
ఉద్యోగుల్లో ఇప్పటికీ అయోమయమే
స్పష్టమైన ఆదేశాలు లేక గందరగోళం

ఇంటి నుంచే చేయాలన్న కేంద్రం
సీఎస్‌ తాజా ఆదేశాలున్నా అస్పష్టతే

జిల్లాలు, సచివాలయంలోనూ అయోమయం

ఉద్యోగుల్లో ఇప్పటికీ అయోమయమే... స్పష్టమైన ఆదేశాలు లేక గందరగోళం
ఇంటి నుంచే చేయాలన్న కేంద్రం.. సీఎస్‌ తాజా ఆదేశాలున్నా అస్పష్టతే =

 



(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఫీసుకు వెళ్లాలా... వద్దా? 'ఇంటి నుంచి పని' మనకు
పకమరనో లేదా? 'లాక్‌డౌన్‌' అమలులోకి వచ్చి రోజులు
గడిచిపోతున్నా... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం ఇప్పటికీ
ఇదే అస్పష్టత, గందరగోళం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు

చెందిన అన్ని ఆఫీసులను, స్వయం ప్రత్తి పత్తి సంస్థల కార్యాల
యాలను మూసి వేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలి
పింది. పోలీసులు, సాయుధ బలగాలు, ట్రెజరీ, వంటగ్యాస్‌,
పెట్రోలియం, విద్యుత్తు, పోస్టాఫీస్‌, ఎన్‌ఐసీ, జిల్లా
యంత్రాంగం, మునిసిపాలిటీలలో పారిశుధ్య విభాగం, నీటి
సరఫరా విభాగాలకు సంబంధించిన అత్యవసర సేవల ఆఫీ
సులను మాత్రం తెరిచి ఉంచాలని పేర్కొంది. అందులోనూ...
ఆయా కార్యాలయాలను 'కనీస సిబ్బందితో నడపాలని తెలి
పింది. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య
దర్శి కూడా మెమో జారీ చేశారు. కానీ... ఇవి ఇప్పటికీ అమ
లులోకి రాలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమ్ను
ఒక కార్యాలయాన్ని శుక్రవారం మూసివేయగా... ఉన్నతాధికా
రులు ఫోన్‌ చేశారు. "సెలవు ఇవ్వాలని మీకు ఎవరు
చెప్పారు? అలాగని ఎక్కడ ఆదేశాలున్నాయి?' అని ఆగ్ర
హించి మరీ తిరిగి తెరిపించారు.

సచివాలయంలోనూ అంతే...

జిల్లాలు, మండల కేంద్రాల సంగతి వదిలేస్తే... పాలనా కేంద్రమైన సచివాలయంలోనూ ఇంటి నుంచి పనిపై గందర గోళం కొనసాగుతోంది. అత్యవసర సర్వీసుల జాబితాలో సచి వాలయంలోని అన్ని విభాగాలు రావు. ఇలాంటి విభాగాల వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలి. కానీ... గతంలో సిబ్బందిని రెండు బృందాలుగా విభజించి, వారం విడిచి వారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలన్న ఆదేశాలే అమలవుతున్నాయి. సీఎస్‌ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై కూడా సచివాలయ ఉద్యో గులకు ఎలాంటి సమాచారం లేదు. 'వచ్చిన వారు వస్తారు. రానివారు రారు' అన్నట్లుగా నడిపించేస్తున్నారు. సచివాల యంలో 82 విభాగాలు ఉండగా, సీఎస్‌ ఆదేశాల మేరకు... మునిసిపల్‌ శాఖ కార్యదర్శి మాత్రం సచివాలయంలోని తమ విభాగం సిబ్బందిని ఇంటి వద్ద నుంచే పని చేయవలసిందిగా ఉత్త ర్వులు ఇచ్చారు. నిజానికి.. వర్క్‌ ఫ్రం హోమ్‌పై స్పష్టత లేకున్నా, ఉద్యోగులు సచివాలయానికి రాలేకపోతున్నారు. శుక్రవారం ఉద్యోగుల హాజరు 10 శాతా నికి పడిపోయింది. ఒకవైపు కరోనా ఉదృతి కలకలం సృష్టిస్తోంది. మరో వైపు... 'లాక్‌డౌన్‌' పకడ్పందీగా అమల వుతోంది. రోడ్లమీదికి వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటు న్నారు. పరిస్థితి తీవంగా ఉన్నావర్క్‌ (=... ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయకపోవ డంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం = చేస్తున్నారు. లా . 'వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌'ను సడలించంది )) సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి అమరావతి, మార్చి £/ (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రూపొందించిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిబంధనలను నడలించాలని సచివాలయ ఉద్యో గుల _ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. మొత్తం సిబ్బందిలో సగం ఇంటి దగ్గర, మిగతా సగం ఆఫీ సుల్లో షిప్పలవారీగా పనిచేసే విధానంలో ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా మార్పులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీలున్నవారు కార్యాలయాల్లోనూ, ఆ అవకాశం లేనివారంతా లాక్‌డౌన్‌ కాలమంతా ఇంటి వద్దే విధులు నిర్వర్తించేలా 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' నిబంధనలను సడలిం చాలని వెంకట్రామిరెడ్డి కోరారు. దీనిపై శుక్రవారం సాధా రణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు ఆయన వినతిపత్రం అందించారు. సచివాలయ '“పుర' ఉద్యోగులకు వెసులుబాటు లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని సచివాలయంలోని పురపా లక శాఖ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకొనే అవకాశా న్నిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులి చ్చారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిరక్షణ, తాగునీటి సరఫరా తదితర వ్యవస్థలను నిత్యావసర సర్వీసు లుగా వర్గీకరించినందున అధికారులు, ఉద్యోగులు కొన్ని నిబం ధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆదేశాలు 20 నుంచి లాక్‌ డౌన్‌ కొనసాగనున్న 21 రోజులపాటు లేదా తదు పరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ అమలవుతాయన్నారు. ఉద్యోగులందరి నెలవారీ వేతనాలు నిర్దేశిత సమయానికే చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వర్క్‌ ఎక్కడి నుంచి?"

Post a Comment