డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక

  • యూనివర్సిటీల వీసీల సమావేశంలో నిర్ణయం

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో కొత్త (రివైజ్డ్‌) పాఠ్య ప్రణాళిక అమలు కానుంది. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) కింద బీఏ, బీకాం, బీఎస్సీ తదితర యూజీ కోర్సుల్లో సవరించిన పాఠ్యప్రణాళికను వర్తింపజేస్తారు. 



అడ్మిషన్లు ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టడంతోపాటు   లోపభూయిష్టంగా తయారైన అఫిలియేషన్‌ (అనుబంధ) విధానాన్ని సంస్కరించనున్నారు. వర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో  బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తారు. గురువారం మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సెలర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ వర్తింపచేయాలని,  



 ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం వర్సిటీ కోఆర్డినేటర్‌ను నియమించాలని నిర్ణయించారు. అప్రెంటి్‌సషిప్‌ కోసం ఇన్‌స్టిట్యూట్‌లను/పరిశ్రమలను గుర్తించాలని, నైపుణ్య ఆధారిత విద్య మరియు అప్రెంటి్‌సషిప్‌ కోసం వర్సిటీ స్థాయిలో కోఆర్డినేటర్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయానికొచ్చారు. స్టూడెంట్‌ డేటా బేస్‌ నిర్వహణ, జీరో అడ్మిషన్‌, 25ు కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్న కాలేజీలకు డీ అఫిలియేషన్‌ చేయడంపైనా చర్చించారు. 


ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నత విద్య స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ పాల్గొన్నారు. 


అన్ని వర్సిటీల్లోనూ ‘కరోనా’ చర్యలు

కరోనా వైరస్‌ నియంత్రణ, నివారణ చర్యలకు ఉన్నత విద్యాశాఖ ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రైవేటు, డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలు అన్నీ కరోనా మహమ్మారి పట్ల విద్యార్థులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఉన్నత విద్యాసంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గురువారం విడుదల చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక"

Post a Comment